ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కేవలం ఒకరే డాక్టర్ ఉండటం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, ఒక్క డాక్టర్ ఎంత మంది పిల్లలకు చికిత్స అందిస్తారని తమ కడుపుకోత తీర్చేదెవరని మృతురాలి తండ్రి కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడు వెళ్లబోసుకుని కన్నీరుమున్నీరయ్యారు.