నార్కోటిక్ జాగిలం రొమాతో ఆదిలాబాద్ లో తనిఖీలు

4చూసినవారు
నార్కోటిక్ జాగిలం రొమాతో ఆదిలాబాద్ లో తనిఖీలు
శుక్రవారం ఆదిలాబాద్ లో నార్కోటిక్ జాగిలం 'రొమా'తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ధనగర్ మెహెల్లాకు చెందిన షాహిల్ అహ్మద్ వద్ద గంజాయిని 'రొమా' గుర్తించింది. దీంతో పోలీసులు షాహిల్ అహ్మద్ ను వన్ టౌన్ కు తరలించి, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన, పండించిన, వ్యాపారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ సునీల్ కుమార్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ నాగనాథ్, సిబ్బంది రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్