నార్నూర్ ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ కావేరి హాజరై ఆహారం, పరిశుభ్రతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయుర్వేద వైద్యురాలు డా. జ్యోత్స్న మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి వంటింటి దినుసులే ఉత్తమమని, వంటగది ఒక పెద్ద ఔషధాల గని అని తెలిపారు. యోగ శిక్షకులు మల్లేష్, సరస్వతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.