ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ సీ సీ, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. దేశ సమగ్రతను కాపాడుతూ 'ఒకే జాతి, ఒకే దృక్పథం, ఒకే భారత దేశం' అనే నినాదాన్ని ఆచరించాలని కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ రఘు గణపతి విద్యార్థులకు సూచించారు. ఎన్సిసి క్యాడిట్లు నినాదాలతో వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.