
ఆస్పత్రికి వచ్చిన యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి కోసం ఆస్పత్రికి వచ్చిన యువతిని ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. కృష్ణలంకకు తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




