నూతన సంవత్సర తొలిరోజు గురువారం కావడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుకలు జరుపుకున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ఆశీస్సులు స్వీకరించి, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. ఆలయాలన్నీ భక్తుల రాకతో కిటకిటలాడాయి.