నిర్మల్ జిల్లాకు ఆదివాసి పోరాటయోధుడు రాంజీ గోండు పేరు పెట్టాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. గురువారం రాంజీ గోండు వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాంజీ గోండు చరిత్రను భావితరాలకు చాటిచెప్పేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆదివాసీల హక్కులు, చట్టాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.