ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు: విద్యార్థులకు ఎంపీ నగేష్ దిశానిర్దేశం

2చూసినవారు
మావల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ మరియు కామర్స్ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం మంగళవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు శ్రీ గెడం నగేష్, ఏడు రోజుల పాటు విద్యార్థులు చేసిన సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన విద్యార్థులకు సామాజిక సేవ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, హక్కులు, బాధ్యతల గురించి తెలియజేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, ప్లేట్లు, పెన్నులు, ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు, జిజ్ఞాసలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ అతిక్ బేగం, వాలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ, పాఠశాలకు ఆరో ప్లాంట్ మంజూరు చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్