గ్రామ పంచాయతీల్లో అడ్డగోలు బిల్లుల వ్యవహారంపై జిల్లా పంచాయతీ శాఖ స్పందించింది. ఇచ్చోడ మండలంలో రైతు పట్టా పాసు పుస్తకాన్ని, సొనాల మండలంలో వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్‌ను బిల్లులకు బదులుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఘటనలపై అధికారులు విచారణ చేపట్టారు. నిధులు సక్రమంగానే వినియోగించినా, బిల్లులు లేక వేరే కాగితాలు అప్‌లోడ్ చేశారని నివేదిక ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. కేవలం రెండు పంచాయతీల్లోనే విచారణ చేయడం విమర్శలకు తావిస్తోంది.