బోథ్ నియోజవర్గంలోని సిరికొండ, నేరడిగొండ, సోనాల మండలాల గ్రామస్తులు త్రి ఫేస్ కరెంట్, రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారుల అనుమతులు ఇప్పించాలని మాజీ ఎంపీ సోయం బాపూరావును కోరారు. ఈ మేరకు వారికి వినతి పత్రం అందించారు. ఈ సమస్యలను జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపెల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మాజీ ఎంపీ హామీ ఇచ్చారు.