ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో జై జవాన్ నగర్‌కు చెందిన వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.