భక్తి మార్గంలో నడవాలి

1చూసినవారు
భక్తి మార్గంలో నడవాలి
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని హరిభక్త నివృత్తి మహారాజ్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని బోయవాడ గణేష్ మండపం వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, పండుగలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దత్తాత్రి, మాజీ ఉపసర్పంచ్ తోకల చందు, కాలనీవాసులు నివృత్తి మహారాజ్‌ను సన్మానించి ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్