ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సమిష్టి కృషితో బాల కార్మికుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చని ఆయన అన్నారు. జిల్లా పోలీసుల పిలుపుతో ఆపరేషన్ స్మైల్ ద్వారా 85 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. జిల్లావ్యాప్తంగా 35 కేసులు నమోదు చేయగా, 79 మంది బాలురు, 6 మంది బాలికలను యంత్రాంగం రక్షించింది. బాలలు బడులకు వెళ్లాలని పోలీసులు పిలుపునిచ్చారు.