పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. వి. శ్రీకాంత్ మాట్లాడుతూ, జార్జి రెడ్డి స్ఫూర్తితో విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని సంఘం కార్యాలయంలో పి.డి.ఎస్.యు 20వ జిల్లా మహాసభలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి గణేష్ తదితరులు పాల్గొన్నారు.