ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాచీన జైనథ్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయంతో పాటు కోనేరు అభివృద్ధి కోసం రూ.1.50 లక్షలు మంజూరు అయ్యాయని, ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి సమీక్షించి, ఆలయ పరిసరాలు, కోనేరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, ఆలయ కమిటి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.