ఆదిలాబాద్ జిల్లాలోని కేఆర్కే కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి దీపాల సమస్యల పరిష్కారం కోరుతూ 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము, కాలనీ వాసులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచించారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి శశికాంత్, ఎల్చాలా పోచన్న, ముస్లె ఈశ్వర్, సునీల్ పాల్గొన్నారు.