మావలలో పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఫణిధర్, ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ ఫ్రాడ్స్ పై అవగాహన కల్పించారు. గంజాయి నిర్మూలన, 100 డయల్, విలేజ్ పోలీస్, తదితర వాటి గురించి వివరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు