హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ అండా

7చూసినవారు
హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ అండా
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు లక్ష్మి కుటుంబానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఆమె కుమార్తె సౌజన్యకు ఈ చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, సిబ్బంది, హోంగార్డుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ చంద్రశేఖర్, సీసీ కొండరాజు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్