మహిళల రక్షణకు పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత

2చూసినవారు
మహిళల రక్షణకు పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత
ఆదిలాబాద్ జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన తెలిపారు. మహిళల రక్షణకు పోలీసు యంత్రాంగం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. జైనథ్ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా నూతన గదిని ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పరిశీలించి, పరిశుభ్రత, రికార్డుల నవీకరణపై సూచనలు చేశారు. మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you