రేపు ఆదిలాబాద్ లో ప్రజావాణి కార్యక్రమం రద్దు

2చూసినవారు
రేపు ఆదిలాబాద్ లో ప్రజావాణి కార్యక్రమం రద్దు
రేపు ఆదిలాబాద్ లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయింది. నిర్మల్ జిల్లాలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్న సమావేశానికి జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉన్నందున, కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అయితే, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, ప్రజలు తమ సమస్యలను అక్కడే పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్