తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. సుమారు 24 మంది ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు.