నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందుపై ప్రతిష్టమైన చర్యలు

505చూసినవారు
నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందుపై ప్రతిష్టమైన చర్యలు
ఆదిలాబాద్ పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాలపై సమగ్రంగా సమీక్షించి, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందుల విక్రయాలపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని, రైతులను మోసం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్