స్వచ్ఛత, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణపై కార్యక్రమాలు

0చూసినవారు
స్వచ్ఛత, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణపై కార్యక్రమాలు
ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛత, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపునకు ఈ నెల 13, 14 తేదీల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ కార్యాచరణను వివరించారు. ఈ నెల 13న మండలాల పరిధిలో ఎంపిక చేసిన పంచాయతీల్లో “మన ఊరు – మన నీరు” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న అన్ని పాఠశాల కాంప్లెక్సుల్లో “ఆరోగ్య జాతర” నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులతో స్కిట్స్, పాటలు, నృత్యాలు నిర్వహించి ఆరోగ్యంపై సందేశాలు ఇవ్వాలని సూచించారు.