తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికులు ఆదిలాబాద్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట గురువారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ మోసిన్ ఖాన్ మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయాలని, పీస్ రేటు కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు స్పష్టం చేశారు.