కేంద్రం పత్తి దిగుమతులపై విధించిన 11 శాతం పన్నును రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్‌లో తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ ఈ పన్ను రద్దు భారతీయ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.