ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, కలెక్టర్ రాజార్షిషా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిలిపివేస్తామని, కోడ్ ముగిసిన వెంటనే యథావిధిగా తిరిగి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.