నార్నూర్ మండలంలోని మాల్కుగూడ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాథోడ్ ధనలక్ష్మి మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు కోసం ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుక్మబాయి పాల్గొన్నారు.