రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ హోమియోపతి డాక్టర్ గా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వీ రమణ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రవికిరణ్ యాదవ్ ను ఆదివారం రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ప్రజలకు హోమియోపతి విభాగంలో అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ డాక్టర్ గా నిలవడం జిల్లాకే గర్వకారణమని వారు అన్నారు. డాక్టర్ రవికిరణ్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.