ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డిపై రెబల్స్‌గా పోటీచేసిన నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై కనిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి తరఫున వారందరు ఒకే బృందంగా కలిసి ప్రచారం చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.