ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సంఘాల పాలక మండలి నియామకాలపై రాజకీయ వేడి రాజుకుంది. గతంలో పరోక్ష ఎన్నికల ద్వారా జరిగే ఈ నియామకాలను, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులతో భర్తీ చేయాలని నిర్ణయించింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఈ నియామకాలు జరుగుతుండటంతో, ఆ పార్టీలోనే రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి.