
ఏపీలో సాయంత్రంకల్లా పరిస్థితి మెరుగుపడుతుంది: పౌరసరఫరాల శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సాయంత్రానికల్లా పరిస్థితి మెరుగుపడుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఒక ఆయిల్ కంపెనీ ఏకపక్ష నిర్ణయం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాపై ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి సమీక్షించారని, కేవలం సరఫరాలోనే సమస్యలున్నాయని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నబాబు హెచ్చరించారు.




