రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం విమానాశ్రయంలోని హెలిపాడ్ వద్ద బందోబస్తు చర్యలను పరిశీలించి, పోలీసులకు పలు సూచనలు చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ముమ్మర తనిఖీలు చేపట్టాయి.