రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఢిల్లీ isic లో సీటు

3చూసినవారు
రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఢిల్లీ isic లో సీటు
ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. మామిడి శరత్ రావు ఢిల్లీలోని ఇండియన్ స్పైనల్ ఇంజురీస్ సెంటర్ (ISIC)లో స్పైన్ సర్జన్ ఇన్ ఫెలోషిప్ లో చోటు సంపాదించారు. 2025లో నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన ఎఫ్ఎన్బీ ప్రవేశ పరీక్షలో ఆయన జాతీయస్థాయిలో 44వ ర్యాంకు సాధించారు. ఈ రెండేళ్ల కోర్సులో తెలంగాణ నుంచి ఢిల్లీ ISICలో సీటు సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, కుటుంబ సభ్యులు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్