ఆదిలాబాద్ జిల్లాలోని ముత్నూర్ గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని కారు అతివేగంతో ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తులను ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.