ఆదిలాబాద్ DIET College Hall లో విద్యా ఉద్యమంపై రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా CCV జిల్లా అధ్యక్షులు తల్లపెల్లి పోచన్న మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం ప్రమాదకరమని, ప్రభుత్వ బడులను కాపాడుకోవడం అంటే పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడమేనని అన్నారు. విద్య అనేది వ్యాపారం కాదు, సామాజిక బాధ్యతని, ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటానికి Council for Citizens Voice (CCV) పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.