ఆదిలాబాద్ నుంచి మియాపూర్‌కు ఆర్టీసీ సర్వీస్

1026చూసినవారు
ఆదిలాబాద్ నుంచి మియాపూర్‌కు ఆర్టీసీ సర్వీస్
ఆదిలాబాద్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌లోని కెపిహెచ్బి కాలనీ, మియాపూర్‌కు ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బస్సు ఆదిలాబాద్ నుంచి ఉదయం 10.50 గంటలకు, రాత్రి 9.45 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, మియాపూర్ నుంచి ఆదిలాబాద్‌కు ఉదయం 11.15 గంటలకు, రాత్రి 9.00 గంటలకు నడుస్తుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్