ఎస్. ఐ. ఆర్. ప్రక్రియ పకడ్బందిగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. భోరాజ్ మండలం పెండల్ వాడ గ్రామంలో బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ) ప్రక్రియను ఆయన క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియ వివరాలను, బిఎల్ఓ లను అడిగి, రికార్డులను తనిఖీ చేశారు.