నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. దివ్యాంగులు మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, మొబైల్‌కు సమాచారం అందిన తర్వాత తమ ధ్రువపత్రాలతో శిబిరాలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.