మహిళలు, చిన్నారుల భద్రత: ఆదిలాబాద్ షీ టీమ్ రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం

2చూసినవారు
మహిళలు, చిన్నారుల భద్రత: ఆదిలాబాద్ షీ టీమ్ రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం
మహిళలు, చిన్నారుల భద్రతలో విశేష ప్రతిభ కనబరిచిన ఆదిలాబాద్ షీ టీమ్, ఏప్రిల్ నెల రాష్ట్ర సమీక్షలో రెండో స్థానం సాధించింది. క్లస్టర్-IVలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. షీ టీమ్ 65 ఫిర్యాదులు స్వీకరించి, 9 FIRలు, 40 కేసులు నమోదు చేసి, 52 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 39 గ్రామాలను సందర్శించి, 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించిందని SP అఖిల్ మహాజన్ వెల్లడించారు.