ఆదిలాబాద్ లో కే ఆర్కే కాలని లోని 7 వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను మమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడే తీసిన మట్టిని తొలగించే పనులు చేపడుతున్నారు. అదే విధంగా చెత్తచేదరాన్ని ఇంటింటా తిరుగుతూ సేకరించి వాహనంలో తరలిస్తున్నారు. ఈ సందర్బంగా కాలనీ కౌన్సిలర్ రాము మాట్లాడుతూ ప్రజలు తమ వంతు బాధ్యతగా కాలనీకీ సహకరించాలని కోరారు. చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా చెత్త బండిలోనే వెయ్యాలన్నారు.