సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగిరే వేసేటప్పుడు విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదిలాబాద్ విద్యుత్ శాఖ ఎస్ఈ శేషరావు రాథోడ్ సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల వద్ద పతంగులు ఎగురవేయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఒకవేళ విద్యుత్ వైర్లపై పతంగులు, మాంజాలు చిక్కుకున్నా లేదా విద్యుత్ వైర్లు తెగి కింద పడినా వాటిని తాకకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912 కు సమాచారం అందించాలని ఆయన వివరించారు.