ఆదిలాబాద్ జిల్లా, బేలా మండలం లోని పాటన్ గ్రామపంచాయతీలో ఆదివారం పోలియో కార్యక్రమంలో సర్పంచ్ గులాబ్ గెడం, ఉపసర్పంచ్ రాజు సరస్వతి వార్, ఆశ వర్కర్ బాబితా, గ్రామస్తులు పురుషోత్తం రెడ్డి, షేక్ అమిర్, కాపేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పోలియోను పూర్తిగా నివారించడానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.