ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌తోనే గ్రామాల్లో ప్రగతి సాధ్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి పనులను చూసే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని, నూతనంగా చేరిన వారందరూ గ్రామ వికాసానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఆదిలాబాద్‌కు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు.