ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. అతిక్ బేగం మాట్లాడుతూ, అణగారిన వర్గాల వారికి విద్య కష్టంగా ఉన్న కాలంలో సావిత్రిబాయి తన భర్త సహాయంతో విద్యనభ్యసించారని తెలిపారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ స్వప్న, దేశంలో తొలి బాలికల పాఠశాలను ఆమె స్థాపించారని పేర్కొన్నారు. రేఖ గారు మాట్లాడుతూ, ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు కూడా పాల్గొన్నారు.