ఆదిలాబాద్ జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పోలీసు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 42 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో స్పెషల్ పార్టీ బలగాలు, 11 షాడో పోలింగ్ స్టేషన్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 599 మందిని బైండోవర్ చేయగా, 20 ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేశామని, ఆరు పోలీస్ స్టేషన్లకు ఆరుగురు పర్యవేక్షణ అధికారులను నియమించినట్లు తెలిపారు.