ఇండ్ల నిర్మాణ పనులు జరిగేలా చూడండి

4చూసినవారు
ఇండ్ల నిర్మాణ పనులు జరిగేలా చూడండి
సాత్నాల మండలం దుబ్బగూడా ఆదివాసీల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వాటిని తొలగించి నిర్మాణాలు జరిగేలా చూడాలని అఖిలపక్ష నాయకులు ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం లేతుబాయి అనే మహిళ ఒక ఎకరం భూమిని దానం చేశారని, అయితే ఆ భూమి అటవీ పరిధిలోకి వస్తుందని అధికారులు నిర్మాణాలను అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్