రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్.. చిన్నారి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

2632చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఐదు రోజుల శిశువు మృతి చెందగా, మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరా నిలిపివేసి, చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఘటనపై ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్