సిరికొండ మండలంలోని ఫకీర్ నాయక్ తండలో జగదంబ అమ్మవారి ఆలయంలో నవరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలు ప్రతిరోజూ సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మండల SI, స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని, మారుమూల గ్రామంలో పండుగ వాతావరణం బాగుందని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఫకీర్ నాయక్ తండ నుండి ఎలాంటి గొడవలకు సంబంధించిన కేసులు తన వద్దకు రాలేదని, గ్రామ నాయకులను, మాజీ సర్పంచ్‌ను, గ్రామ ప్రజలను కోరుతూ ప్రసంగించారు.