రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో నెం. 49తో ఆదివాసీలకు అన్యాయం జరగవచ్చని కొమురంభీం ఆశయ సాధన కమిటీ మండలాధ్యక్షుడు యాదవ్ రావు అన్నారు. ఆయన సోమవారం ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి సిరికొండ తహసీల్దార్ తుకారాంకు వినతి పత్రం సమర్పించారు. జీవో నెం. 49ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ జీవోతో ఆదివాసీలు తమ పోడు భూములపై హక్కులు కోల్పోతున్నారని వివరించారు.