ఇంటి వద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

2చూసినవారు
ఇంటి వద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి బుధవారం ఒక ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని భక్తులు రూ. 151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.